Rayalaseema: మా రాయలసీమ రాజధాని మాకివ్వండి: ములపాకు ప్రతాపరెడ్డి

Rayalaseema: 1953 నాటి పరిస్థితుల ప్రకారమే రాయలసీమకు రాజధాని ఇవ్వాలని రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములపాకు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు.

Rayalaseema
X

Rayalaseema: మా రాయలసీమ రాజధాని మాకివ్వండి: ములపాకు ప్రతాపరెడ్డి

Rayalaseema: చిత్తశుద్ధి లేని రాయలసీమ రాజకీయ నాయకులు-మా రాయలసీమ రాజధాని మాకు ఇప్పించండి..రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములపాకు ప్రతాపరెడ్డి.

1953వ సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయని, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి లేదని, అంతకుమునుపు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం ప్రత్యేక రాయలసీమ కావాలని పోరాడిందని చాలామంది నాయకులు ఆంధ్ర తో కలిసి ఉండడానికి ఇష్టపడలేదని, అందుకు కారణాలు చూస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అనంతపురం నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలించుకొని పోవడం, సాగునీటి ప్రాజెక్టులలో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి గుర్తించిన రాయలసీమ ఉద్యమ నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండడం కంటే మద్రాసు రాష్ట్రంలోనే కలిసి ఉంటాం లేకుంటే రాయలసీమ రాష్ట్రం ఇవ్వండి అని ప్రతిపాదించారని,

కానీ అప్పటి ఆంధ్ర ప్రాంత వ్యక్తులు కొంతమంది నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించాలని, అందుకు బదులుగా రాయలసీమకు రాజధాని మరియు నీటి ప్రాజెక్టులలో ప్రముఖ ప్రాధాన్యత కల్పిస్తామని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరిచారని, 1953 తర్వాత కర్నూలు రాజధాని కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఉందని, కానీ అటు తర్వాత 1956 నవంబర్ న తెలంగాణ కలవడంతో రాజధాని మళ్లీ రాయలసీమ ప్రజలను మభ్యపెట్టి రాజధానిని హైదరాబాద్కు తరలించారని, ఇప్పుడు 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఉందని, కాబట్టి రాజధాని కూడా అప్పుడు ఉన్నట్లే రాయలసీమలో ఉండాలని రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములపాకు ప్రతాపరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అప్పటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా ఉందని అవే ప్రాంతాలు ఉన్నాయని కాబట్టి రాయలసీమలో రాజధాని ఉండాలని, కేంద్రీకృత రాజధాని అనే విధానాన్ని విడగొనాలని, అందుకే రాయలసీమ హక్కులు నెరవేర్చకపోవడం వలన మళ్లీ రాయలసీమ రాష్ట్ర ఉద్యమం మొదలైందని, పాత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాయలసీమలో రాజధాని ఉండడం న్యాయమని ప్రాజెక్టులు పరిశ్రమలు రాయలసీమకు చెందాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణలో రాయలసీమ నీచ రాజకీయ నాయకుల ఆస్తులు ఉన్నాయని,వారు రాయలసీమ అ రాయలసీమ మొదటి తరం నాయకులకు ఉన్నంత చిత్తశుద్ధి ప్రస్తుతం రాయలసీమ నాయకులకు లేదని, వారి దృష్టిలో వారి సొంత అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకుంటూ ఉన్నారని, ఇది సరికాదని ప్రతాప్ రెడ్డి తెలియచేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్