Pattikonda: దేవనకొండలో 'ఇంచార్జ్' గోల.. రైతుల తిప్పలు!
Pattikonda: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే TG-RYS కార్యక్రమంలో అర్జీలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు.
Pattikonda: దేవనకొండలో 'ఇంచార్జ్' గోల.. రైతుల తిప్పలు!
Pattikonda: మండలంలో 26 గ్రామ పంచాయతీలు, 18 మజార గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రానికి చుట్టూ గ్రామాలు దాదాపు 26 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నాయి.పెద్ద మండలం కావడంతో ఉన్న రెవెన్యూ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. కర్నూలు- బళ్లారి ప్రధాన రహదారి 35కిలోమీ టర్ల మేర పరిధి మేరకు ఉండటంతో సుదూరల ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి తమ పనుల నిమిత్తం వచ్చే రైతులు, ప్రజలకు రెగ్యులర్ తహసిల్దార్ అందుబాటులో లేకపోవడం వలన పనులు పరిష్కారం కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
గత మూడేళ్ల కాలంలో 8 మంది తహసిల్దార్లు మారడం నియమించే తహసిల్దార్లను కూడా ఇన్చార్జి తహసీల్దారులుగా నియమించడం వల్ల రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు ఆన్లైన్లో ముటేషన్ కట్టిన తర్వాత 25 రోజులకు అడంగల్ లో పేరు మార్పు జరుగుతుంది కానీ తాసిల్దారులు రెగ్యులర్ గా ఉండకపోవడం వలన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది ప్రస్తుతం భూ సర్వే జరిగే గ్రామాలలో రైతులకు వచ్చే భూ సమస్యల్లో తగాదాలు ఏర్పడి తాసిల్దార్ కార్యాలయానికి వస్తే భూమి తగ్గిన రైతు కు సరైన సమాధానం చెప్పక కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి
స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా కార్యాలయంలో ఇన్చార్జి తాసిల్దార్ తోనే పనులు నెట్టుకొస్తున్నారు. దీంతో తాసిల్దార్ కార్యాలయంలో పనులు కావడంలేదని నిత్యం ప్రజలు విసిగిపోతున్నారు. మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి.
దేవకొండ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తికొండ డివిజనలో అతి పెద్ద రెవిన్యూ మండలంగా ఉంటూ భూ వివాదాలు అధికంగా ఉన్న మండలంలో కూడా దేవనకొండ మండలం ప్రధానంగా ఉంది రెగ్యులర్ తాసిల్దార్ లేకపోవడం వలన ప్రతి సోమవారం కర్నూలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే టిజిఆర్ఎస్ కార్యక్రమానికి అనునిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లి అర్జీలు ఇస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం ఇక్కడున్న సమస్యలు అక్కడే ఉండడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ప్రధానంగా మండలంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా ఉండటంతో భూసమస్యలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రెండేళ్లుగా కార్యాలయంలో రెగ్యులర్ తహసీల్దార్ వచ్చినా పట్టుపని నెలరోజులైనా పనిచేయడం లేదు. దాంతో కిందిస్థాయి ఉద్యోగులకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడం, లేదా పక్క మండలాల తహసీల్దార్లకు ఉన్నతాధికారులు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో మండల ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. గతంలో రెగ్యులర్ తహసీల్దార్‌గా జయన్న నియమించారు.
నెలరోజుల వ్యవధిలోనే రిటైర్మెంట్ కావడంతో మళ్లీ ఇన్చార్జి తహసిల్దార్ని నియమించాల్సి వచ్చింది. ప్రస్తుతం రెవెన్యూ గ్రామంలో భూరీసర్వే జరుగుతోంది. దానికి తోడు గ్రామాల్లో భూరీసర్వే సమయంలో రైతుల భూముల విషయంలో వచ్చే సమస్యల పైన సమాధానం తీవ్ర గందరగోల పరిస్థితి నెలకొంది. ఇన్చార్జి తాసిల్దార్ గా ప్రస్తుతం కొనసాగుతున్న సుదర్శనం కూడా అధిక అధిక భాగం రెవెన్యూ సమస్యలను తమ పరిధిలో లేదు ఆర్డిఓ జెసి గారి పరిధిలో ఉందని చెప్పడంతో రైతుల సమస్యలు పరిష్కారం కాక అలాగే పెండింగ్లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
మళ్లీ గత రోజు తాసిల్దార్ లో బదిలీలో భాగంగా ఆస్పరి తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తాసిల్దార్ వైకే రామేశ్వర్ రెడ్డిని దేవనకొండ మండలానికి ఇన్చార్జి తహసీల్దారుగా కేటాయించడం జరిగింది ఇన్చార్జిల పాలనతో రైతులు ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు రెగ్యులర్ తహసిల్దారులు ఏర్పాటు చేస్తే తమ బోర్డును విన్నవించుకొని,
తమ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు ఉంటాయన్న రైతులు ప్రజల విజ్ఞప్తి మేరకు ఇప్పటికైనా దేవనకొండ మండలానికి రెగ్యులర్ తహసిల్దార్ని నియమించి సుదూర ప్రాంతాల నుండి మండల కేంద్రానికి వచ్చే రైతుల భూ సమస్యల పరిష్కారానికి తగు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కార్యాలయంలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులు సమయానికి వచ్చినా కూడా ఇన్చార్జ్ ఎమ్మార్వో వచ్చిన నెల రోజుల్లో మారిపోతున్నారు.
ఉన్న కొందరు భూరీసర్వే పనుల్లో భాగంగా పత్తికొండ ఆర్డీఓ కార్యాలయానికి తిరగాల్సి వస్తోంది. దీంతో ప్రజలు సమస్యలతో వచ్చి అధికారుల కోసం కార్యాలయంలో పడిగాపులు పడాల్సి వస్తోంది. చిన్న పనైనా రోజుల తరబడి కార్యాలయానికి రావాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రెగ్యులర్ తహసీల్దార్‌ని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.




