Kurnool: కర్నూలు జీజీహెచ్‌లో ఉచితంగా ‘సదరం’ సేవలు: డా. వెంకటేశ్వర్లు
Kurnool: కర్నూలు జీజీహెచ్‌లో సదరం సర్టిఫికెట్ల కోసం లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
Kurnool: కర్నూలు జీజీహెచ్‌లో ఉచితంగా ‘సదరం’ సేవలు: డా. వెంకటేశ్వర్లు
కర్నూలు : ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంప్‌కు వచ్చే ప్రజలతో ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సూపరింటెండెంట్ మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ కోసం ఆసుపత్రిలో ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సదరం క్యాంప్‌లో విధులు నిర్వహించే వైద్యులు అందుబాటులో ఉంటారని, సదరం క్యాంప్‌కు సంబంధించిన అన్ని సేవలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగానే అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా సదరం క్యాంప్‌లో సేవలు అందించేలా అధికారులు, వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేశామని సూపరింటెండెంట్ డా. కే. వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రజలు మధ్య వర్తులను నమ్మకుండా, ఎలాంటి డబ్బులు చెల్లించకుండా నేరుగా ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో పాటు RMO లు డాక్టర్ వెంకట రమణ, డాక్టర్ సునీల్ ప్రశాంత్ మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




