Nallamala: జంగిల్ సఫారీకి బ్రేక్.. 90 రోజుల పాటు పర్యాటకులపై నిషేధం!

Nallamala: నల్లమల అభయారణ్యంలో జంగిల్ సఫారీ, ఎకో టూరిజం కేంద్రాలను 90 రోజుల పాటు మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 1 July 2026 1:09 PM IST
Nallamala
X

Nallamala: జంగిల్ సఫారీకి బ్రేక్.. 90 రోజుల పాటు పర్యాటకులపై నిషేధం!

నల్లమల: భారతదేశంలోనే అతి పెద్దదైన పెద్ద పులుల సంరక్షణ అభయారణ్యం నాగార్జునసాగర్ - శ్రీశైలం అభయారణ్యంలో మానవ సంచారాన్ని జాతీయ పెద్ద పులుల సాధికారత సంస్థ, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నిషేధిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు 90 రోజులపాటు దేశంలోని 54 పెద్ద పులుల అభయారణ్యాల పరిధిలో ఈ నిషేధం అమలవుతుంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో సుమారు 5,600 చ.కిమీ. లలో విస్తరించిన ఎన్ ఎస్ టి ఆర్,

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లోని నల్లమల జంగిల్ సఫారీలలో పర్యాటకుల సంచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

ఒకనాటి నల్లమల కేంద్ర రాజధాని పేచ్చెరువు పెద్దపులల సహజ పునరుత్పత్తి, ఆవాస కేంద్రం. ఈ ప్రాంతం నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

ఎంతో కీలకమైన ఆత్మకూరు నల్లమలలో ఉన్న బైర్లూటి జంగిల్ సఫారీ, ఎకో టూరిజం కేంద్రాల ముసివేతకు ఆత్మకూరు డివిజన్ ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ ఆదేశించారు.

దేశవ్యాప్తంగా పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం కావడం వల్ల అటవీశాఖ మూడు మాసాల నిషేధ చర్యలు చేపట్టింది. శ్రీశైల శిఖర సమీపంలో నుంచి వెళ్లే ఇష్టకామేశ్వరి ఆలయానికి భక్తుల రాకపోకల వాహనాలను నిలిపివేశారు.

అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీప పచ్చర్ల, తుమ్మల బయలు జంగిల్ సఫారీలను మూసివేశారు.

భూమిపై అంతరించిపోతున్న పెద్దపులి జాతి భారతదేశంలోనే మన కొనసాగిస్తూ ఐ యు సి ఎన్ రెడ్ లిస్ట్ డేటాలో చేరింది. ప్రపంచంలో ఉన్న పెద్దపులులలో 50 శాతం భారతదేశంలో ఉంటే .. అందులో 35 శాతం పెద్దపులులు ఏపీలోని ఎన్ ఎస్ టి ఆర్ లో ఉన్నాయి.

కేంద్ర ఎన్ టి సి ఎ ఆదేశాలను ముల్లంగించి పెద్ద పులుల అభయారణ్యం, పులులు సంచరించే సరిహద్దుల్లో ఎవరు ప్రవేశించినా కఠిన చర్యలు తప్పవని ఎన్ ఎస్ టి ఆర్ ఫీల్డ్ డైరెక్టర్ హెచ్చరించారు.

గత ఆరు మాసాలుగా నల్లమలలో దేశవ్యాప్త పెద్దపులుల లెక్కింపు అంచనాల ప్రక్రియ జూన్ మాసంలో ముగిసింది.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story