Atmakur: కృష్ణమ్మ ఒడిలోకి చేరని సంగమేశ్వర క్షేత్రం.. ఇంకా భక్తుల దర్శనాలు

Atmakur: ఆత్మకూరు సప్త నది సంగమేశ్వర క్షేత్రంలో ఇంకా కొనసాగుతున్న దర్శనాలు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక కృష్ణానదిలో మునగని చారిత్రక ఆలయం.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 30 Jun 2026 9:27 AM IST
Atmakur
X

Atmakur: కృష్ణమ్మ ఒడిలోకి చేరని సంగమేశ్వర క్షేత్రం.. ఇంకా భక్తుల దర్శనాలు

ఆత్మకూరు: నాలుగు యుగాల ఇతిహాస నేపద్య అతి ప్రాచీన క్షేత్రం.. తీర్థ రాజ్యం సప్త నది సంగమేశ్వర క్షేత్రం. ఈ ఏడాదిలో ఈపాటికే కృష్ణవేణి నదీ మా తల్లి గర్భంలో జలాధివాసంలోకి వెళ్లాల్సిన ఈ క్షేత్రం భక్తులకు ఇంకా దర్శనమిస్తుంది.

నల్లమల ప్రకృతి అందాల మధ్య ఏడు నదులు సంఘమించే అరుదైన ప్రదేశంలో సంగమేశ్వర ఆలయాన్ని దర్శించే భక్తులు ఇక్కడి ప్రకృతికి ఆధ్యాత్మిక తన్మయంలో పరవశించి పోతున్నారు. ఎల్ నినో ప్రభావం నల్లమలపై తీవ్రత చూపిస్తుంది.

కారు మబ్బులు మేఘ రూపంలో సంగమేశ్వర సప్త నదుల జలాలపై కమ్ముకొని వర్షించాలని చేస్తున్న ప్రయత్నం .. విఫలమవుతూనే ఉంది .. చినుకు జాడ లేకుండా పోయింది.

కృష్ణవేణి జలాధివాసంలోకి వెళ్లేందుకు .. ఎప్పుడెప్పుడా అని మేఘాల వైపు చూస్తూ ఆది క్షేత్రం సంగమేశ్వర ఆలయం సుదీర్ఘ నిరీక్షణ చేస్తుంది. ఈ క్షేత్ర, నది తీర జల సవ్వడులు.. నల్లమల ప్రకృతి అందాల నడుమ సప్త నది సంగమేశ్వర క్షేత్రం కొత్త శోభను సంతరించుకుంది.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story