Podili: పోతవరంలో సమాధుల తోట కబ్జా.. రంగంలోకి దిగిన ఎస్సీ కమిషన్!
Podili: మార్కాపురం జిల్లా పోతవరం గ్రామంలో క్రైస్తవుల సమాధుల తోట కబ్జాకు గురవుతోందన్న ఆరోపణలపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు విచారణ చేపట్టారు.
Podili: పోతవరంలో సమాధుల తోట కబ్జా.. రంగంలోకి దిగిన ఎస్సీ కమిషన్!
మార్కాపురం జిల్లా: పొదిలి మండలం పోతవరం గ్రామానికి చెందిన క్రైస్తవుల సమాధులతోట ఆక్రమణకు గురవుతుందని, పోతవరం గ్రామం క్రైస్తవుల పక్షాన స్టానిక జనసేన పార్టీ నాయకులు హల్చల్ జహీర్ రాష్ట్ర ఎస్సి కమిషన్ చైర్మన్ కె. ఎస్. జవహర్ కు ఫిర్యాదు చేయగా శుక్రవారం రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యులు మేకల భిక్షం దాసు, డా.పాకనాటి గౌతమ్ రాజ్ పోతవరం గ్రామస్థులను కలసి కబ్జాకు గురవుతుందనే ఆరోపణలు విషయం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. సమాధులున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు.
స్థానిక తహసీల్దార్ యం.వి. కృష్ణారెడ్డి ని వివరాలు అడిగి తెలుకున్నారు. పోతవరం గ్రామస్థులు, పెద్దలు మాట్లాడుతు తాము గత 60 ఏళ్లకు పైగా ఇక్కడే శవాలను పూడ్చిపెడుతున్నామని, ఇప్పుడు మాకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయాలని చూడడం అన్యాయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్సి కమిషన్ అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఈసందర్బంగా ఎస్సి కమిషన్ సభ్యులు భిక్షం దాసు, గౌతమ్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర చైర్మన్ ఆదేశాల మేరకే తాము క్షేత్రస్థాయిలో పర్యటించి నిజనిర్ధారణ చేస్తున్నామని తెలిపారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలిపారు.




