Nandyal: తాగునీటి కటకట - అల్లాడుతున్న వల్లంపాడు గ్రామస్తులు!

Nandyal: కోవెలకుంట్ల మండలం వల్లంపాడులో తీవ్ర తాగునీటి సమస్య. 3 కి.మీ దూరం వెళ్లి బైకులపై నీరు తెస్తున్న గ్రామస్తులు; మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి విజ్ఞప్తి.

Ramanaiah, Banaganepalle
Published on: 13 Aug 2026 8:12 AM IST
Nandyal
X

Nandyal: తాగునీటి కటకట - అల్లాడుతున్న వల్లంపాడు గ్రామస్తులు!

Nandyal: కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామంలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది వర్షాలు ముఖం చాటేసాయి ఆగస్టు నెలలో కుందునదిలో చుక్క నీరు కరువై ఎడారిని తలపిస్తుంది

వల్లంపాడు గ్రామంలో నీటి సమస్య తీవ్రమైంది విద్యుత్ మోటార్ల ద్వారా కుళాయిలకు సరఫరా చేసేందుకు మోటార్లకు నీరు అందడం లేదు మోటార్ల ద్వారా కొంచెం నీరు అందిన నీరు దుర్వాసన వెదజల్లుతుంది

వల్లంపాడు గ్రామంలో కుందూ నది నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఒక్క బోరుబావి కూడా లేకపోవడంతో గ్రామస్తులు చిన్నకొప్పెర్ల, అప్పలాపురం పెద్దమ్మ పొలిమేర దగ్గరకు 3 కిలోమీటర్ల దూరం వెళ్లి ద్విచక్ర వాహనాలపై నీరు తెచ్చుకుంటున్నారు

పాడి పెంపకం దారులు వాడుకోవడానికి నీరు లేక గత నాలుగు రోజులుగా అగచాట్లు పడుతున్నారు వల్లంపాడు గ్రామవాసులు మంచినీటి సమస్యతో అలమటిస్తున్నారు

ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వల్లంపాడు గ్రామ నీటి సమస్యను పరిష్కరించాలని వల్లంపాడు ప్రజలు కోరుకుంటున్నారు

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story