Dornala: ఆపదలో ఉన్న పేద కుటుంబానికి వైఎస్సార్‌సీపీ నేత చేయూత

Dornala: ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మార్కాపురం జిల్లా దోర్నాల మండలం అయినముక్కుల గ్రామానికి చెందిన గుజ్జుల రమణమ్మ కుటుంబానికి సరుకులు పంపిణీ చేశారు.

Srikanth Singam, Markapur
Published on: 22 Jun 2026 3:49 PM IST
Dornala
X

Dornala: ఆపదలో ఉన్న పేద కుటుంబానికి వైఎస్సార్‌సీపీ నేత చేయూత

Dornala: దోర్నాల మండలంలోనిఅయిన ముక్కుల గ్రామం దాసరి కాలనీకి చెందిన గుజ్జుల రమణమ్మ కుటుంబం ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్ షేక్షావలి సోమవారం ఆ కుటుంబానికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా గుజ్జుల రమణమ్మ మాట్లాడుతూ, ఆపద సమయంలో తమ కుటుంబాన్ని ఆదుకుని నిత్యావసర సరుకులు అందించిన షేక్ షేక్షావలికి కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

షేక్ షేక్షావలి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు తన వంతు సహాయం అందించడం కొనసాగిస్తానని తెలిపారు. సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అవసరమైన వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సతీష్, చాంద్ బాషా, దాసు, శివ, మున్నా, పీరా, మహబూబ్ బాషా, కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story