Atmakur: కొలనుభారతి క్షేత్రంలో నేత్రపర్వంగా శాకాంబరి మహోత్సవం!

Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీ కొలనుభారతి సరస్వతి ఆలయంలో శాకాంబరి మహోత్సవం వైభవంగా జరిగింది.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 7 Aug 2026 10:45 PM IST
Atmakur
X

Atmakur: కొలనుభారతి క్షేత్రంలో నేత్రపర్వంగా శాకాంబరి మహోత్సవం!

ఆత్మకూరు: తీవ్ర దుర్భిక్షం.. వర్షా భావ పరిస్థితి.. అనా వృష్టి.. వరుణుడు కరుణించకపోవడం.. ప్రజలు తీవ్ర కరువు కాటకాలకు లోన్ అవుతున్న సందర్భంలో దేశంలోని రెండవ సరస్వతి క్షేత్రం.. నవ్యాంధ్రప్రదేశ్లో .. ఏకైక చదువుల తల్లి ఆలయం శ్రీ కొలనుభారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి శాకాంబరి మహోత్సవ క్రతువులు నిర్వహించారు ఆలయ అర్చకులు, పేద పండితులు. శ్రీ సరస్వతి అమ్మవారు శాకంబరీ దేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమలలో వే లిసిన శ్రీ కొలను భారతి సరస్వతి ఆలయంలో శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో శాకంబరీ దేవి మహోత్సవం శాశ్వతంగా నిర్వహించారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావం.. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో వరుణుడు కరుణించక వర్షాలు లేక కరువు ఛాయలు సంభవించాయి. ఇలాంటి దుర్భిక్ష స్థితి నుంచి కరువు కాటకాల నుంచి రైతులను.. ప్రజలను రక్షించమంటూ.. శ్రీ కొలను భారతి సరస్వతి అమ్మవారికి 60 రకాలకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, దుంపలతో అలంకరణ కావించారు రుద్విజలు.

ఆలయ గర్భాలయం, అంతరాలయం, ముఖమండపాలలో ఆకుకూరలు.. కూరగాయల అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. గర్భాలయంలో శ్రీ సరస్వతి అమ్మవారు శాకంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ప్రాతః కాలంలో అమ్మవారిని చారు గోషిని జలాలతో ఆలయ అర్చకులు అభిషేకించారు. సుప్రభాత సేవ, అమ్మవారికి అర్చన అభిషేకాలు, ప్రధమ నివేదన, హారతి, మంత్రపుష్పం తదుపరి భక్తుల దర్శనానికి గర్భాలయ ద్వారాలు తెచ్చుకున్నాయి.

భక్తులు అమ్మవారికి శాకంబరీ మహోత్సవ క్రతువులు ఆర్జిత సేవలు చేపట్టారు. సాయం సంధ్య వేళల్లో మహా నివేదన, పుష్పాంజలి, మహా మంగళ హారతి కవాట స్పందన తో శాకాంబరి మహోత్సవ ఉత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు కొలను భారతి సరస్వతి దేవిని దర్శించి సేవించుకున్నారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story