Markapuram: ఎస్‌ఐఆర్’ డిజిటైజేషన్ 100 శాతం చేయాలితహశీల్దార్ ఆదేశం!

Markapuram: గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పనులను తహశీల్దార్ పరిశీలించారు. ఓటర్ల వివరాల డిజిటైజేషన్‌ను 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 6 July 2026 4:18 PM IST
Markapuram
X

Markapuram: ఎస్‌ఐఆర్’ డిజిటైజేషన్ 100 శాతం చేయాలితహశీల్దార్ ఆదేశం!

మార్కాపురం: మండలంలోని దరిమడుగు, పెద్ద నాగులవరం, కొండేపల్లి, రామచంద్రపురం పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని తహశీల్దార్ కె. చిరంజీవి పరిశీలించారు.

ఈ సందర్భంగా మరణించిన, శాశ్వత వలస, డబుల్ ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేసి, ఓటర్ల వివరాల డిజిటైజేషన్‌ను 100 శాతం పూర్తి చేయాలని బీఎల్ఓలు, సూపర్వైజర్లకు సూచించారు.

ఇప్పటికే 70 శాతం మంది ఓటర్లు SIR సేవలను వినియోగించుకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని తహశీల్దార్ చిరంజీవి తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story