Duvvuru: దువ్వూరు మండలంలో గురువారం నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ!

Duvvuru: దువ్వూరు మండలంలో గురువారం నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు ఎంపీడీవో జవహర్‌బాబు తెలిపారు. మొత్తం 6,973 మందికి రూ. 2.99 కోట్లు అందజేత.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 30 Sept 2026 7:33 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరు మండలంలో గురువారం నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ!

Duvvuru: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం దువ్వూరు మండలవ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జవహర్‌బాబు తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

​మండల పరిధిలోని 15 గ్రామ సచివాలయాల పరిధిలో మొత్తం 6,973 మంది లబ్ధిదారులకు ₹2,99,05,000 (రెండు కోట్ల 99 లక్షల 5 వేల రూపాయలు) పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులు ఉన్నారు.

​ఈ పంపిణీ ప్రక్రియ కోసం 126 మంది సచివాలయ సిబ్బందిని నియమించామని, గురువారం ఉదయం 7 గంటల నుంచే నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తారని ఆయన స్పష్టం చేశారు. పింఛన్‌దారులు ఎక్కడికీ వెళ్లకుండా తమ ఇళ్ల వద్దనే ఉండి పింఛన్ మొత్తాన్ని స్వీకరించాలని ఎంపీడీవో సూచించారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR