Nandyal: వెలుగోడులో వినాయక నిమజ్జనంపై ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ!

Nandyal: నంద్యాల జిల్లా వెలుగోడులో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ స్వయంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

R Pavankalyan, Nandyal
Published on: 18 Sept 2026 1:07 PM IST
Nandyal
X

Nandyal: వెలుగోడులో వినాయక నిమజ్జనంపై ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ!

Nandyal: నంద్యాల జిల్లా వెలుగోడులో వినాయక నిమజ్జనంపై ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ.. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జన శోభాయాత్ర, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు.

వెలుగోడు పట్టణ కేంద్రంలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా నంద్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ వెలుగోడు పట్టణానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

మోటార్ సైకిల్‌పై పట్టణంలోని ప్రధాన వీధులు, నిమజ్జన మార్గాల్లో పర్యటించిన ఎస్పీ... పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ ప్రాంతాల్లో భద్రత, నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని... పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ కోరారు.

జిల్లా ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భద్రతా ఏర్పాట్లను పరిశీలించడంతో పోలీసు సిబ్బందిలో మరింత సమన్వయం, అప్రమత్తత పెరిగింది. వెలుగోడులో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా నంద్యాల జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది..

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal