Markapuram: ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు కలెక్టర్ ఆదేశం
Markapuram: ల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
Markapuram: ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు కలెక్టర్ ఆదేశం
మార్కాపురం: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, రెవెన్యూ, భూ వివాదాలు, సంక్షేమ పథకాలు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం తదితర సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను కలెక్టర్ విజయ సునీత , జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు కు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత , జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించి, తీసుకున్న చర్యలపై బాధితులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.




