Srisailam: లోకకల్యాణం కాంక్షిస్తూ శుక్రవారం దేవుని సర్కారి సేవ నిర్వహణ!

Srisailam: శ్రీశైల క్షేత్ర గ్రామదేవత శ్రీ అంకాళమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు, పంచామృతాభిషేకం. లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో సర్కారి సేవ.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 10 Oct 2026 10:58 AM IST
Srisailam
X

Srisailam: లోకకల్యాణం కాంక్షిస్తూ శుక్రవారం దేవుని సర్కారి సేవ నిర్వహణ!

Srisailam: లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర గ్రామదేవత అయిన శ్రీ అంకాళమ్మవారికి శుక్రవారం ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది.ప్రతీ శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మవారికి దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది.

ఇందులో భాగంగా శ్రీఅంకాళమ్మవారికి అభిషేకం, విశేషఅర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి. కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీభాగవతంలో చెప్పబడింది.

కాగా ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన డమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట మకుటం గల ఈ దేవి వస్త్రాలంకృతురాలైనా కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.

కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఆ తరువాత లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, జలముతో విశేషఅభిషేకం అర్చనలు నిర్వహించబడ్డాయిని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM