Srisailam: శ్రీశైలం ఆలయంలో భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు!

Srisailam: కార్తీకమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలంకార దర్శనంతో పాటు క్యూలైన్లలో అల్పాహారం, అన్నప్రసాదం కల్పించినట్లు ఈవో తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 16 Nov 2026 9:44 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం ఆలయంలో భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు!

Srisailam: కార్తీకమాసంలో భక్తులు వేకువజాము నుండే ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.

కార్తీకమాసంలో కార్తీక సోమవారాలు మరియు కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం భక్తులందరు సంతృప్తికరంగా స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

తెల్లవారుజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం తెల్లవారుజాము 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలను ఏర్పాటు చేశారు.

అదేవిధంగా ఆలయశుద్ధి, ప్రదోషకాలం అనంతరం సాయంకాలం మహామంగళహారతి సమయంలో కూడా అనగా సాయంత్రం గం. 5.30ల నుంచి దర్శనాలు ప్రారంభించడం జరిగింది.

స్వామివార్ల అలంకార దర్శనం

భక్తులరద్దీకారణంగా శని,ఆది,సోమవారాలలో మరియు పౌర్ణమి మొదలైన రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది. భక్తులందరికీ శ్రీస్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

సిబ్బందికి ప్రత్యేక విధులు

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై రద్దీరోజులలో దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

క్యూలైన్లలో అల్పాహారం

కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర, బిస్కెట్లు మరియు మంచినీరు అదేవిధంగా ఈ రోజు ఉదయం వేళలలో వేడిపాలు కూడా అందజేయడంజరిగింది.

కార్తీకదీపోత్సవం

భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు ముందుగా ఆలయ ఉత్తర మాడవీధి మరియు గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి అదేవిధంగా గంగాధర మండపం వద్ద పలువురు భక్తులు దీపారాధన చేసుకోవడం జరిగింది.

అన్నప్రసాద వితరణ

భక్తులకు అన్న ప్రసాదం ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతున్నాయని తెలిపారు. . అలాగే సాయంత్రం గం. 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడ్డాయి.

లడ్డు ప్రసాదాలు

కార్తీకమాసంలో భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని 12 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు అందజేయబడుతున్నాయని అన్నారు. ఇందులో ప్రత్యేకంగా మహిళలకు ఒక కౌంటరు మరియు వృద్ధులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM