Srisailam: శ్రీశైల క్షేత్రంలో జ్వాలా వీరభద్రస్వామికి ప్రదోషకాల విశేష పూజలు

Srisailam: శ్రీశైల ఆలయ ప్రాంగణంలో మల్లికాగుండం పక్కనున్న జ్వాలా వీరభద్రస్వామికి లోకకల్యాణార్థం ప్రదోషకాలంలో దేవస్థానం ఆధ్వర్యంలో విశేష అభిషేకం, పుష్పార్చన జరిగాయి.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 11 Nov 2026 9:56 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైల క్షేత్రంలో జ్వాలా వీరభద్రస్వామికి ప్రదోషకాల విశేష పూజలు

Srisailam: లోక కల్యాణంకోసం జ్వాలా వీరభద్రస్వామి వారికి విశేషపూజలను నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామిజ్వాలామకుటంతో పదిచేతులతోవిశిష్టరూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది.

కాగా ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేషఅభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తారు పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది.

కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమంనిర్విఘ్నంగాజరిగేందుకు మహాగణపతి పూజను నిర్వహిస్తారు తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను నిర్వహిస్తారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM