Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం!

Srisailam: సెప్టెంబర్ 12 వరకు కొనసాగనున్న ఉత్సవాలు.. వీరశిరోమండపంలో అఖండ శివ భజనలు ప్రారంభించిన చైర్మన్ రమేష్ నాయుడు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 13 Aug 2026 9:30 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం!

శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రవణ మసోత్సవాలు ప్రారంభమైనయి నేటి నుండి సెప్టెంబర్ 12 వరకు జరగనున్నాయి లోక కల్యాణం కోసం ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా దేవస్థానం అఖండ శివ భజనలు నిర్వహిస్తోంది నెలంతా రేయింబవళ్లు నిరంతరంగా ఈ భజన సాగనున్నాయి పవిత్ర అఖండ భజనలు శ్రావణమాస ప్రారంభం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వీరశిరోమండపంలో ప్రారంభం కాగా కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు,అర్చకులు,అధికారులు పాల్గొన్నారు.

భజనలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించి భజన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ,శాస్త్రోక్తంగాచండీశ్వరస్వామికి విశేష పూజ అనంతరం శివప్రణవ పంచాక్షరీనామ భజనను ప్రారంభించారు.

అయితే కర్నూలు నుండి 5 కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు శివభజనలు చేయడానికి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు,చైర్మన్ రమేష్ నాయుడు అవకాశం కల్పించారు అలానే శ్రావణమాసం మొదటి రోజు కావడంతో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ కూడా పెరిగింది.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story