Nandyal: డోన్ శ్రీ సుధ పాఠశాల విద్యార్థుల ‘గోల్డెన్’ రికార్డ్!

Nandyal: నంద్యాల జిల్లా డోన్ శ్రీ సుధ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు.

Bharat Raj, Dhone
Published on: 30 April 2026 9:55 PM IST
Nandyal
X

Nandyal: డోన్ శ్రీ సుధ పాఠశాల విద్యార్థుల ‘గోల్డెన్’ రికార్డ్!

నంద్యాల జిల్లా: డోన్ పట్టణంలో ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో శ్రీ సుధ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 188 మంది విద్యార్థుల్లో దాదాపు 117 మంది 500 పైగా మార్కులు సాధించడం విశేషం. అలాగే 9 మంది విద్యార్థులు 590 పైగా మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. డోన్ పట్టణంలో ఇద్దరు విద్యార్థులు 596 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయానికి కారణమయ్యాయి. ఈ ఫలితాలతో పాఠశాల ఖ్యాతి మరింత పెరిగింది. ఇతర విద్యార్థులకు ఇది ప్రేరణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story