Srisailam: పౌర్ణమి వేళ శ్రీ భ్రమరాంబ దేవికి ఘనంగా ‘లక్ష కుంకుమార్చన
Srisailam: శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ దేవికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
Srisailam: పౌర్ణమి వేళ శ్రీ భ్రమరాంబ దేవికి ఘనంగా ‘లక్ష కుంకుమార్చన
Srisailam: పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించబడింది. కాగా సోమవారం 30 మంది భక్తులు పరోక్షసేవగా ఈ కుంకుమార్చనను జరిపించుకుంటున్నారు.
ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజలను నిర్వహించుకుంటున్నారు. అలాగే కత్తారు నుంచి కూడా ప్రవాహ భారతీయులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు.
కాగా లక్షకుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం పఠించబడుతుంది. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించడం జరుగుతుంది. అనంతరం లక్షకుంకుమార్చన జరిపించబడుతుంది.
కాగా మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు పేర్కొంటున్నారు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.
కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునేందుకువీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవను నిర్వహిస్తోంది. ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్‌లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులుసేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 లను సంప్రదించవచ్చును.




