Srisailam: శ్రీశైలం దేవస్థానానికి 416 గ్రాముల వెండి వస్తువులు విరాళం
Srisailam: శ్రీశైలం మల్లికార్జున దేవస్థానానికి రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌కు చెందిన పి. రవీందర్ కుటుంబ సభ్యులు 416 గ్రాముల వెండి నాగాభరణం సమర్పించారు.
Srisailam: శ్రీశైలం దేవస్థానానికి 416 గ్రాముల వెండి వస్తువులు విరాళం
Srisailam: శ్రీశైలం మహా క్షేత్రంలో మంగళవారం పి. రవీందర్ కుటుంబసభ్యులు, నాదర్గుల్, రంగారెడ్డి జిల్లా కు చెందిన అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని మరియు వెండి చెంబును దేవస్థానమునకు సమర్పించారు.
ఈ వెండి నాగాభరణం మరియు వెండి చెంబుతో కలిపి బరువు 416 గ్రాములు.ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపములో దాతలు అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ఉపప్రధానార్చకులు బి. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి,
అమ్మవారి ఆలయం ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జున, గుమాస్తా శ్రీమతి సావిత్రిలకు అందజేశారు. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.
Next Story




