Srisailam: గిరిజన గూడెంలో మల్లన్న.. భక్తుల ముంగిటకే దేవుడు!

Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో ‘మా స్వామి మల్లన్న - మా చెంతకే’ ధర్మ ప్రచార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 7 May 2026 9:54 AM IST
Srisailam
X

Srisailam: గిరిజన గూడెంలో మల్లన్న.. భక్తుల ముంగిటకే దేవుడు!

శ్రీశైలం నంద్యాల జిల్లా: శ్రీశైలంలో వైభవంగా మా స్వామి మల్లన్న మాచంతకే కార్యక్రమం ప్రారంభం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం మేకల బండలో ప్రారంభమైన ధర్మ ప్రచారం. కార్యక్రమంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ధర్మ ప్రచార రథంలో ఆసీనులను చేసి బయలు వీరభద్ర స్వామి ఆలయం వద్ద ప్రారంభ పూజలు నిర్వహించి మేకల బండ శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రగా ధర్మ ప్రచార రథంలో వచ్చిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు చెంచుగూడెం లోని చెంచులు వారి సాంప్రదాయ నృత్యంతో ఘన స్వాగతం పలికారు. తర్వాత చెంచుగూడెం లో వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన కళ్యాణోత్సవంలో చెంచులు ఆనందంతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్ల ఆశీర్వచనం గా తీర్థ ప్రసాదాలతో పాటు చెంచులకు చీరలు పంచలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం శ్రీనివాసరావు, ఐటీడీఏ పీవో పి.వీ.ఎస్ నాయుడు ట్రస్ట్ బోర్డు మెంబర్ గంగమ్మ పాల్గొన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story