Srisailam: శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా ఘనంగా శ్రీ స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ
Srisailam: శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా వైభవంగా గిరి ప్రదక్షిణ. ఈవో శ్రీనివాసరావు, భక్తుల విశేష భాగస్వామ్యం. అమ్మవారికి ప్రత్యేక లక్ష కుంకుమార్చన పూజలు.
Srisailam: శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా ఘనంగా శ్రీ స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ
శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైలం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించారు.
సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్ల మహమంగళహరతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులనుజేసి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లను ధర్మప్రచార రధంలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని అర్చకులు,ఈవో శ్రీనివాసరావు,అధికారులు ప్రారంభించారు.
ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై వీరభద్రస్వామి ఆలయం,మల్లమ్మ కన్నీరు ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకొని నంది మండపము మీదుగా ఆలయ మహద్వారము చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు,సిబ్బంది పాల్గొన్నారు గిరిప్రదక్షిణానంతరం పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబికా దేవికి లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు.
లక్ష కుంకుమార్చన పూజలలో పరోక్షసేవలో పాల్గొనే అవకాశం కల్పించడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రల భక్తులు లక్షకుంకుమార్చనలో పాల్గొన్నారు.




