Srisailam: శ్రీశైలంలో చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబికా దేవి దర్శనం!

Srisailam: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శ్రీ భ్రమరాంబికా దేవి చంద్రఘంట అలంకారంలో, శ్రీస్వామి అమ్మవార్లు రావణ వాహనంపై దర్శనమిచ్చారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 14 Oct 2026 7:14 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబికా దేవి దర్శనం!

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజు భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు శ్రీ భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు రావణ వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు.

అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు,చెక్క భజనలు కేరళ వాద్యాలు,గిరిజన నృత్యాలు వివిధ రకాల నృత్యాలు,వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవం కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM