Srisailam: వైభవంగా సాగిన మల్లికార్జునస్వామి గిరిప్రదక్షిణ!
Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీస్వామి అమ్మవార్ల గిరిప్రదక్షిణ కార్యక్రమం.
Srisailam: వైభవంగా సాగిన మల్లికార్జునస్వామి గిరిప్రదక్షిణ!
Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైలం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు,ఈవో శ్రీనివాసరావు దంపతులు ఘనంగా నిర్వహించారు సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్ల మహ మంగళ హరతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులనుజేసి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లను ధర్మప్రచార రధంలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని అర్చకులు, అధికారులు ప్రారంభించారు ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై వీరభద్రస్వామి ఆలయం, మల్లమ్మ కన్నీరు ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకొని నంది మండపము మీదుగా ఆలయ మహద్వారము చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు గిరిప్రదక్షిణానంతరం పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబికా దేవికి లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు లక్ష కుంకుమార్చన పూజలలో పరోక్షసేవలో పాల్గొనే అవకాశం కల్పించడంతో 24 మంది భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రల భక్తులు పాల్గొన్నారు.




