Srisailam: శ్రీశైల భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి గిరిప్రదక్షిణ

Srisailam: శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 29 Jun 2026 9:29 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైల భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి గిరిప్రదక్షిణ

Srisailam: పౌర్ణమి సందర్భంగా దేవస్థానం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభించారు. ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంటుంది.

అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంటుంది. హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్ధిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంటుంది. రుద్రవనం నుంచి నందిమండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.

శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది.

గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణానంతరం శ్రీస్వామివార్లదర్శనం కల్పించబడుతోంది.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story