Srisailam: శ్రీశైలం హైవేపై అగ్ని ప్రమాదం నడిరోడ్డుపై తగలబడ్డ పల్సర్ బైక్!
Srisailam: శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
Srisailam: శ్రీశైలం హైవేపై అగ్ని ప్రమాదం నడిరోడ్డుపై తగలబడ్డ పల్సర్ బైక్!
శ్రీశైలం: హైదరాబాద్ జాతీయ రహదారి పై అగ్ని ప్రమాదం రోడ్డు పై వెళుతున్న బైక్ లో అకస్మాత్తుగా రాజుకున్న మంటలు అప్రమత్తమైన బైకర్ బైక్ దిగగానే మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన బైక్ ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు కాకుండా బయట పడ్డ బైకర్
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో సాయి కిరణ్ అనే యువకుడు తన బైక్ NS 200 బజాజ్ పల్సర్ లో పెట్రోల్ కొట్టించి తిరిగి పెద్దాపూర్ గ్రామానికి వెళుతుండగా అకస్మాత్తుగా కాలు పెట్టే దగ్గర చిన్న నిప్పు రాజుకుంటున్నట్టు గమనించిన సాయి కిరణ్ వెంటనే అప్రమత్తమై బైక్ ను రోడ్డు పై అపి దిగేసరికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మంటల్లో తన బైక్ పూర్తిగా కాలి పోయింది
క్షణాల్లో ఈ ప్రమాదం జరిగిందని రెండు లక్షల విలువ చేసే బైక్ కాలి బూడిదవదైన సరే యువకుడు ప్రాణాలతో బయట పడటంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు..
సాయి కిరణ్ సొంత గ్రామం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయపల్లి గ్రామం పెద్దాపూర్ లో ఉండే తన అక్క ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు...సాయి కిరణ్ బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో బైక్ లో పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది




