Srisailam: గిరిజన గూడేలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే 'జన్ భాగిదారి' వారోత్సవాలు!

Srisailam: శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో మే 18 నుండి 25 వరకు 'జన్ భాగిదారి' ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 17 May 2026 3:14 PM IST
Srisailam
X

Srisailam: గిరిజన గూడేలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే 'జన్ భాగిదారి' వారోత్సవాలు!

Srisailam: గిరిజన మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు మే నెల 18 వ తేది నుండి 25 వ తేది వరకు ఐ.టి.డి.ఎ, శ్రీశైలం ఆధ్వర్యం లోని మూడు జిల్లాలు అనగా నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల లోని PMJANMAN (Pradhan Mantri Janjati Adivasi Nyaya Maha Abhiyan) మరియు DAJGUA (Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan) ఆవాసాలలో ‘జన్ భాగిదారి – సబ్ సే దూర్, సబ్ సే పెహలే’ అనే కార్యక్రమము నిర్వహింపబడుతుందని తెలియజేయడమైనది. నంద్యాల జిల్లాలోని 48 పి. వి. టి. జి ఆవాసాలు, మార్కాపురం జిల్లాలోని 89 ఆవాసాలు మరియు పల్నాడు జిల్లాలోని 82 ఆవాసాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

నంద్యాల జిల్లాకు శ్రీ KG నాయక్, పి.యం.NREGS, మార్కాపురం జిల్లాకు శ్రీ A.సురేష్ కుమార్, APOజనరల్, పల్నాడు జిల్లాకు శ్రీ పీక్లా నాయక్, ఎ.పి.డి. వెలుగు జిల్లా నోడల్ ఆఫీసర్ గా నియమించడమైనది. అదే విధంగా నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల గిరిజన సంక్షేమ ఆధికారులు ఆయా జిల్లాలకు జిల్లా సమన్వయ అధికారులు గా వ్యవహరిస్తారు. కాగా ఆయా జిల్లాల మండల అభివృద్ధి అధికారులు మండల నోడల్ ఆఫీసర్లుగా ఉంటారు. అన్నీ ఆవాసాలకు గ్రామ స్థాయి అధికారులను నియమించడమైనది. మండల అభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో వారు నియమించిన గ్రామ స్థాయీ అధికారుల ద్వారా పైన చెప్పిన అన్నీ గ్రామాలలో ఈ కార్యక్రమము నిర్వహింపబడుతుంది .

ఈ కార్యక్రమము లో భాగంగా 18 వ తేది మూడు జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో జిల్లా కలెక్టర్ల చేత ఈ కార్యక్రమము ప్రారంభోత్సవము కావింపబడుతుంది. 19 వ తేది ఆయా గ్రామాలలో గ్రామ సభ నిర్వహణ మరియు మొక్కలు నాటే కార్యక్రమము చేయబడుతుంది. 20 వ తేది transect walk జరుపుట మరియు జన్ సున్వాయ్ కార్యక్రమము నిర్వహించే తేది ప్రకటించుట జరుగుతుంది. 19 వ తేది నుండి 25 వ తేది వరకు Entitlement డ్రైవ్, saturation camp లు మరియు health camp లు నిర్వహింపబడుతాయి. 21 వ తేది నుండి 23 వ తేది వరకు జన్ సున్వాయ్ కార్యక్రమము క్రింద అర్జీ ల స్వీకరణ జరుగుతుంది.

24 వ తేదీన అర్జీల సమీకరణ మరియు PO ITDAమరియు కలెక్టర్లకు నివేదన జరుగుతుంది. 25 వ తేది జిల్లా కలెక్టర్ల ద్వారా జిల్లా స్థాయీ, మండల స్థాయీ, గ్రామ స్థాయీ అధికారుల సమక్షంలో తదుపరి కార్యక్రమం పై చర్చ మరియు ముగింపు కార్యక్రమము తో ఈ కార్యక్రమము ముగుస్తుంది.ఈ కార్యక్రమము పై ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి వారు జిల్లా నోడల్ ఆఫీసర్లు,జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు, మండల నోడల్ ఆఫీసర్లు, మరియు సంబంధిత ఇతర సిబ్బంది తో సమావేశము నిర్వహించి దిశా నిర్దేశము చేయడమైనది. కావునా చెంచు గూడేలలోని గిరిజనులందరు ఈ కార్యక్రమము లో పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేయవలసినదిగా కోరడమైనది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story