Nandyal: శ్రీశైలంలో ఘనంగా కార్తీకమాసోత్సవాలు.. గర్భాలయ అభిషేకాలు నెలపాటు రద్దు!
Nandyal: నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రద్దీ దృష్ట్యా నెలరోజుల పాటు గర్భాలయ అభిషేకాలు రద్దు చేసినట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
Nandyal: శ్రీశైలంలో ఘనంగా కార్తీకమాసోత్సవాలు.. గర్భాలయ అభిషేకాలు నెలపాటు రద్దు!
Nandyal: శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తీకమాసంలో భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలం చేరుకునే అవకాశాలున్నందున భక్తుల రద్ది కారణంగా శ్రీ మల్లికార్జునస్వామి గర్భాలయ అభిషేకాలు సామూహిక ఆర్జిత అభిషేకాలు కార్తీకమాసం మొత్తం నెలరోజులపాటు తాత్కాలికంగా రద్దు చేశామని ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు.
అంతేకాకుండా శని ఆది సోమవారాలలో కూడ స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు కూడ రద్దు చేశామని భక్తులందరికి అలంకారం దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించామని ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు.
అయితే మంగళవారం నుంచి శుక్రవారం వరకు సాధారణ రోజులలో విడతలవారీగా రోజుకు ఐదు విడతలుగా భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆన్ లైన్ మరియు మనమిత్ర వాట్సప్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు భక్తులు గమనించి సహకరించాలని ఈఓ శ్రీనివాసరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
అయితె కార్తీకమాసం ప్రారంభం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులరద్దీ పెరిగింది వేకువజామున నుంచి ఆలయ క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు వేడిపాలు బిస్కట్లు మంచినీళ్లు స్వామివారి పులిహోర ప్రసాదం అందిస్తూ భక్తుల సేవలో అధికారులు నిమగ్నమైయ్యారు.
శ్రీశైలం ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలు నెలరోజులపాటు రద్దు చేసిన కారణంగా భక్తులు నిరాశకు గురికాకుండా దేవస్థానం పరిధిలోని పంచమఠాలలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం నూతనంగా పంచమఠాలలో అభిషేకాలు నిర్వహించుకునేందు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.
నవంబరు 20 కార్తీక శుద్ధ ఏకాదశిరోజున దేవస్థాన ఆగమ పాఠశాల ఎదురుగా కోటి దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామిఅమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు.




