Srisailam: శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు 1,700 మంది ముత్తైదువల పూజలు!
Srisailam: శ్రీశైలం క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు. 1,233 మంది చెంచు గిరిజన మహిళలు సహా 1,700 మంది భక్తుల భాగస్వామ్యం.
Srisailam: శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు 1,700 మంది ముత్తైదువల పూజలు!
Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో నంద్యాల,పల్నాడు,మార్కాపురం జిల్లాలకు సంబంధించిన సుమారు 1233 మంది చెంచు గిరిజన మహిళల ముత్తైదువులు అలానే 500 మంది సాధారణ మహిళలు మొత్తం 17 వందల మంది మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజా సామగ్రిని అందజేసి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని పఠించి నిర్వీఘ్నంగా జరిపించారు.
అనంతరం వ్రతంలో పాల్గొన్న చెంచు గిరిజన మహిళలకు సాధారణ మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా చీర,రవిక పూలు,గాజులు, ప్రసాదం అందజేసి శ్రీ స్వామి,అమ్మవార్ల దర్శనం కల్పించారు వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ మన వైదిక సాంప్రదాయంలో శ్రావణ మాసాన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయబద్ధంగా వస్తుందని అన్నారు.
శ్రావణమాసం సర్వ దేవత ప్రీతికరంగా చెప్పబడుతుందన్నారు ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించినట్లు తెలిపారు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గిరిజన చెంచు సోదరీమణులకు అవకాశం కల్పించామన్నారు ముత్తైదువులను ఎంపిక చేయడంలో ఐటీడీఏ అధికారులు మరియు వారి సిబ్బంది ఎంతగానో సహకరించారన్నారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో హర్షింతదగ్గ విషయమన్నారు జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారు మహాశక్తి స్వరూపిని భ్రమరాంబ దేవి స్వయం వ్యక్తంగా వెలసిన శ్రీశైల మాక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాన్ని జరిపించుకునేవారు వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులన్నారు వ్రతంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు,దేవస్థానం మహిళ అధికారులు పాల్గొన్నారు.




