Atmakuru: నిరుపేదలకు సంక్షేమ పథకాలు.. వేల్పనూరులో ఎమ్మెల్యే బుడ్డా
Atmakuru: శ్రీశైలం నియోజకవర్గంలో అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Atmakuru: నిరుపేదలకు సంక్షేమ పథకాలు.. వేల్పనూరులో ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిరుపేదలైన అనారోగ్య బాధితులను ఆదుకుంటామని శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. శ్రీశైలం నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి డబ్బులు లేక అవస్థలు పడుతున్న రోగులకు సీఎంఆర్ఎఫ్ ( చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ) ద్వారా ఆదుకుంటున్నామని ఈ క్రమంలోనే తాజాగా నియోజకవర్గంలో పలు అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సొంత డబ్బులతో చికిత్సలు చేయించుకున్న 58 మంది లబ్ధిదారులకు.
రూ. 30 లక్షల చెక్కులను వేల్పనూరు గ్రామంలో ఎమ్మెల్యే అందజేశారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈరోజు వరకు చికిత్సలు చేయించుకున్న నిరుపేదలకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలను మంజూరు చేయించి అందిస్తున్నామన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి అమలు చేయడంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నామని, సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గం ప్రజలను కోరారు.




