Atmakur: మరోసారి నోరు జారితే బట్టలూడదీసి కొడతా.. ఎమ్మెల్యే బుడ్డా
Atmakur: శ్రీశైలం నియోజకవర్గంలో పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. వైసిపి మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బుడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Atmakur: మరోసారి నోరు జారితే బట్టలూడదీసి కొడతా.. ఎమ్మెల్యే బుడ్డా
Atmakur: శ్రీశైలం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య సాగుతున్న సవాళ్లు.. ప్రతి సవాళ్లు .. తీవ్ర హెచ్చరికలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్పా పై నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడి.. మరోసారి నోరు జారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. మీ ఇంటికి వచ్చి బట్టలూడదీసి కొడతా అంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.
వైఎస్ఆర్సిపి నిర్వహించిన చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు ప్రభుత్వం ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే శిల్ప ఆత్మకూరులో చేసిన తీవ్రమైన విమర్శలపై ఎమ్మెల్యే బుడ్డా ఘాటుగా స్పందించారు. శ్రీశైలం, సున్నిపెంట అభివృద్ధి విషయంలో శిల్పా నోటికి వచ్చినట్లు మాట్లాడినందుకే కొన్ని పదాలు వాడి కౌంటర్ వేశానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
టిడిపి తో పెట్టుకోవద్దు.. బుడ్డా తో అస్సలు పెట్టుకోవద్దు.. ఇక నీ కథ మొదలు పెడతా అంటూ పదేపదే వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో గౌరవ మర్యాదలతో ప్రవర్తిస్తూ సద్విమర్శలు చేయాలని నాయకులు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తూనే ఉంటారని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా హితవు పలికారు.
తనపై చేసిన విమర్శలకు కడుపు మండిన మా కార్యకర్తలే స్వచ్ఛందంగా వైఎస్ఆర్సిపి కార్యాలయం ముందు నిరసన తెలిపారని .. తాను కనుక ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఎమ్మెల్యే బుడ్డా హెచ్చరించారు.
నీకు దమ్ము ధైర్యం ఉంటే మాటలు పక్కన పెట్టి ఏ మీడియా ముందుకు చర్చకు వస్తావో ఏ డేట్ ఫిక్స్ చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో అని శిల్పాకు సవాల్ విసిరారు.
మొత్తానికి ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారింది.




