Atmakur: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే బుడ్డా

Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని కరివేన చెరువులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి 'జలధార' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

M Satya Peter, Atmakur
Published on: 21 April 2026 3:08 PM IST
Atmakur
X

Atmakur: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే బుడ్డా

Atmakur: భవిష్యత్తులో నీటి సమస్య మరింత పెరిగి జన సమూహాలపై తీవ్ర ప్రభావం చూపు తుందని అందుకే ముందు జాగ్రత్తగా జల వనరులను సంరక్షించుకొని ప్రతి నీటి బొట్టును భద్రపరచుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీప కరివేన చెరువులో చేపట్టారు.

పంట కాలువలను పరిశీలించి ఉపాధి హామీ కూలీలతో కలిసి ముళ్ల పొదలను తొలగించారు. పొలాలకు సాగునీరు అందించే పంట కాలువలను, తూములను అతనికి చేశారు. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం కంటే ముందుగా చెరువుల్లో పూడిక, పంట కాలువల మరమ్మతులు, తూముల ఏర్పాట్లు పూర్తిచేయాలని జలవనరుల శాఖ అధికారులకు సూచించారు.

రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి బడ్జెట్లో ఎక్కువ నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టే శ్రీశైలం నియోజకవర్గం లోని అన్ని మండలాల చెరువులు, తూములు, పంట కాలువల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. ప్రస్తుతం తెలుగు గంగ రిజర్వాయర్లో సాగు, తాగునీటికి కావలసిన నీరు సమృద్ధిగా ఉందని రైతులు బెంగ పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రైతులతో అన్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story