Srisailam: శ్రీశైలంలో భక్తులను అలరించిన 'నిత్య కళారాధన' కార్యక్రమాలు!

Srisailam: శ్రీశైలం క్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య కళారాధనలో భాగంగా మహబూబ్‌నగర్ వీరాంజనేయ భజన మండలి భక్తి కీర్తనల ప్రదర్శన భక్తులను అలరించింది.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 30 Jun 2026 9:05 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో భక్తులను అలరించిన 'నిత్య కళారాధన' కార్యక్రమాలు!

Srisailam: శ్రీశైలం దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీరాంజనేయ భజన మండలి, మహబూబ్‌నగర్ వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమములో గజరాజా వదన పార్వతీ పరమేశ, పార్థివలింగా ఓ పార్థివ, నమ:శ్శివాయ, శంభో పార్వతి, శ్రీశైలవాసా, హర హర శంకరా మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను లక్ష్మయ్య, ఆంజనేయులు, మునీంద్ర, శ్రీనివాసులు తదితరులు ఆలాపించనున్నారు.

కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయిని శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story