Srisailam: పాతాళగంగ రోప్‌వే తాత్కాలికంగా నిలిపివేత 30 రోజులు బంద్!
Srisailam: శ్రీశైలం పాతాళగంగ ఏపీ టూరిజం రోప్‌వే 30 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేత. భద్రతా ప్రమాణాలు, మెయింటెనెన్స్ పనుల కారణంగా నిర్ణయం.
Srisailam: పాతాళగంగ రోప్‌వే తాత్కాలికంగా నిలిపివేత 30 రోజులు బంద్!
Srisailam: శ్రీశైలంలోని ఏపి టూరిజం రోప్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు భక్తులు మెట్ల మార్గంలో పాతాళగంగకు వెళ్లాలంటే ఈ రోప్ ద్వారా తీగ మార్గంలో ప్రయాణించి పాతాళగంగ వద్దకు చేరుకుని పుణ్య స్నానాలు చేసేవారు అయితే ఏపి టూరిజం రోప్ వే నిర్మాణం జరిగి సుమారు 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా భద్రతా ప్రమాణాలలో బాగంగా రోప్ వే మెకానికల్ మెయింటినెన్స్ పనులను అధికారులు నిర్వహిస్తున్నారు.
రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా సుమారు 30 రోజులు పాటు పాతాళగంగ సర్వీసులు నిలుపుదల చేశారు రోప్ వే లోని క్యాబిన్స్,రోప్స్,మిషన్స్ మెయింటెనెన్స్ పనులు చేపట్టారు ప్రస్తుతం శ్రీశైలానికి భక్తుల తాకిడి కూడా స్వల్పంగా తగ్గడంతో మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తే రానున్న మరో 10 సంవత్సరాలు వరకు టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా భక్తుల భద్రతకై రోప్ వే మెకానికల్ మరమ్మతు పనులు నిర్వహిస్తున్నామని భక్తులు గమనించి సహకరించాలని అధికారులు ప్రస్ నోట్ ద్వారా కోరారు .




