Srisailam: శ్రీశైలంలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి!
Srisailam: ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి నీటిమట్టం పెరుగుతోంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
Srisailam: శ్రీశైలంలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి!
Srisailam: శ్రీశైలం జలాశయానికి గంటగంటకు నీటిమట్టం పెరుగుతుంది ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద ఉదృతి పెరిగింది దీనితో శ్రీశైలం జలాశయం నీటి మట్టం గంటగంటకు పెరుగుతుంది జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరదనీరు అదిక మొత్తంలో రావడంతో శ్రీశైలం ఎడగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు గడిచిన 24 గంటలలో 3.435 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.
అయితే ఎగువ పరీవాహక ప్రాంతాలైన ఆల్మట్టి నారాయణ్ పూర్ జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి బారీగా వరదనీరు వచ్చి చేరడంతో శ్రీశైలం డ్యామ్ వరదనీటితొ జలకలను సంతరించుకుంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 869.20 అడుగులుగా ఉంది పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగ ప్రస్తుతం 138.2730 టీఎంసీలుగా నమోదైయింది జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ ప్లోగా 2,20,948 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీనితో శ్రీశైలం జలాశయం మరో వారం రోజులలో పూర్తి స్దాయికి చేరుకునే అవకాశం ఉంటుందని డ్యామ్ అధికారులు అంచనాలు వేస్తున్నారు అయితే శ్రీశైలం జలాశయం నుంచి అవుట్ ప్లోగా 7,493 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదలవుతుంది.
శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.




