Srisailam: సుండి పెంట ప్రజలకు భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి
Srisailam: శ్రీశైలం సుండిపెంటలో ప్రభుత్వ ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Srisailam: సుండి పెంట ప్రజలకు భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు సుండి పెంట లో ప్రభుత్వ గృహాలలో అనుమతి లేకుండా ఉన్న ప్రజలను ఖాళీ చేయాలని హైకోర్టు బెంచ్ తీర్పు మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాలతో సుండి పెంట గ్రామంలో ప్రజలకు నోటీసులను జారీ చేశారు ఈ మే నెల17 వ తారీకు లోపు సంజాయిషీ ఇవ్వాలని శ్రీశైలం మండల తాసిల్దార్ సర్వే నిర్వహించి నోటీసులను జారీ చేశారు ఈ విషయమై డ్యామ్ నిర్మాణం నుండి మేము ఇక్కడే నివాసం ఉంటున్నామని శిధిలావస్థలో ఉన్న ఇళ్లను మరమ్మతులు చేయించుకొని తప్పని పరిస్థితుల్లో నివాసం ఉంటున్నామని ఎవరికి తెలపాలో తెలియక భయాందోళనకు గురవుతున్న పరిస్థితులలో శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఈరోజు సుండిపెంట స్థానిక రెడ్ల కళ్యాణమండపం వద్ద సుండుపెంట ప్రజల తో సమావేశమై భరోసా ను ఇచ్చాడు.. ముందుగా సుడిపంట పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక రెడ్ల కళ్యాణ మండపం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజలు భయాందోళనకు గురికా వద్దని న్యాయపోరాటానికి మీ పెద్ద కొడుకుగా పోరాడుతానని న్యా పోరాటానికి కావలసిన ఆర్థిక వనరులను కూడా నా సొంత ఖర్చులతోనే పెట్టుకుంటానని ఒక్క పైసా ఎవరికి ఇవ్వద్దని సుండిపెంటలో నివసించే హక్కు ప్రతికి ఒక్కడికి ఉందని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో సుండిపెంట గ్రామాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాల. ద్వారా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దేనిని ఆయన తెలిపారు. ప్రజలకు మంచి చేస్తానంటే ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి నేను సహకరిస్తానని ప్రజాపూర్వకంగా ఆయన తెలిపారు.




