Srisailam: శ్రీశైలంలో ముగిసిన ఏడవ ధర్మకర్తల మండలి సమావేశం

Srisailam: శ్రీశైల దేవస్థానం ఏడవ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 2 Jun 2026 9:54 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో ముగిసిన ఏడవ ధర్మకర్తల మండలి సమావేశం

Srisailam: శ్రీశైలంలో ఏడవ ధర్మకర్తల మండలి సమావేశం,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న చైర్మన్ రమేష్ నాయుడు. సమావేశంలో ఆరు అజెండాలను చర్చించగా రెండిటికు ఆమోదం, రెండు తిరస్కరణ, రెండు వాయిదా. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు జరిగిన సమావేశం, పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు, సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు. యోగాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చైర్మన్ ఆదేశం. ఈనెల 11న ప్రత్యేక యోగా, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఆమోదం. రాబోవు వర్షాకాలం ముగిసేలోగా 5000 నుంచి 6000 వరకు మొక్కలు నాటాలని నిర్ణయం, దేవతామృక్షాలతో పాటు నీడనిచ్చే మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు. భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా తిరుమల తరహాలో పిలిగ్రేమ్స్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపకల్పన, క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టిన పనులు వేగవంతం చేయాలని నిర్ణయం. క్షేత్రంలో పారిశుద్ధ్యం పట్ల మరిన్ని ప్రత్యేక చర్యలు, జ్యోతి సిద్ధవటంలో విధులు నిర్వహించే సిబ్బందికి పారితోషికం పెంపుకు తీర్మానం.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story