Srisailam: భ్రమరాంబ మల్లికార్జునుల సేవలో హైకోర్టు న్యాయమూర్తులు!
Srisailam: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను అలహాబాద్, పాట్నా హైకోర్టుల న్యాయమూర్తులు అచల్ సచ్దేవ్, శశిభూషణ్ ప్రసాద్ సింగ్ గురువారం దర్శించుకున్నారు.
Srisailam: భ్రమరాంబ మల్లికార్జునుల సేవలో హైకోర్టు న్యాయమూర్తులు!
శ్రీశైలం: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను గురువారం అచల్ సచిదేవ్ అలహాబాద్. శశి భూషణ్ ప్రసాద్ సింగ్. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి టీ.శ్రీనివాసరావు పూలమాలతో స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపం వద్ద వేద పండితులు అర్చక స్వాములు ఆశీర్వచనలు అందించారు. వీరికి స్వామి అమ్మవార్ల జ్ఞాపికతో లడ్డు ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు. వీరితోపాటు పర్యవేక్షకులు రవికుమార్. దేవస్థానం సెక్యూరిటీ సిఎస్ఓ శ్రీనివాసరావు ఉన్నారు.




