Srisailam: శ్రీశైలంలో క్యూ లైన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్

Srisailam: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు ఆలయంలోని క్యూ లైన్లు, విరాళాల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 15 July 2026 9:07 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో క్యూ లైన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్

Srisailam: శ్రీశైల ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు క్యూలైన్లు, విరాళాల కేంద్రాన్ని ఆకస్మికoగా తనిఖీ చేశారు. ఆయా దర్శనo టికెట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవoతమైన దర్శనం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

క్యూ లైన్లలో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సంబంధిత సిబ్బంది ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ దర్శనం క్యూలైన్లను నిర్వహిస్తుండాలన్నారు. అధికారులు పరస్పర సమన్వయముతో విధులు నిర్వర్తించాలన్నారు.

భక్తుల రద్దీ సమయంలో ముఖ్యంగా వారాంతపు సెలవులు పర్వదినాలలో క్యూ లైన్ల నిర్వహణ పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు క్యూ లైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారo అందిస్తుండాలని అధికారుకు సూచించారు. దర్శనము వేళలు, దర్శనాలకు పట్టే సమయం మొదలైన అంశాలను నిరంతరం ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ప్రసారం చేస్తుండాలన్నారు.

క్యూ లైన్లు, క్యూకాంప్లెక్స్ లో లైట్లు, ఫాన్లు, సజావుగా పనిచేసే విధంగా సంబంధించిన సిబ్బంది పర్యవేక్షిస్తుండాలన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వైరింగులకు ఎప్పటికప్పుడు అవసరమైన తగు మరమత్తులు చేస్తుoడాలన్నారు.

ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పలువురు భక్తులతో నేరుగా మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా దర్శనము ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, ప్రసాద వితరణ , పారిశుద్ధ్యనిర్వహణ గురించి భక్తులతో సంభాషించారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story