Srisailam: శ్రీశైలం క్యూలైన్లలో దేవస్థానం చైర్మన్ ఆకస్మిక తనిఖీ

Srisailam: శ్రీశైలం క్షేత్రంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు క్యూలైన్లు, దర్శనం టికెట్ల కౌంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 17 July 2026 9:04 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం క్యూలైన్లలో దేవస్థానం చైర్మన్ ఆకస్మిక తనిఖీ

Srisailam: శ్రీశైలం క్షేత్రంలో ఈరోజు దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు క్యూలైన్స్, విరాళాల కేంద్రాన్ని,దర్శనం టికెట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

సంబంధిత సిబ్బంది ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ దర్శనం క్యూ లైన్లు నిర్వహిస్తుండాలన్నారు భక్తుల రద్దీ సమయంలో ముఖ్యంగా వారాంతపు సెలవులు పర్వదినాలలో క్యూలైన్ల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు భక్తులకు ఇబ్బందులు కరుగకుండా ఉండేందుకు క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారం అందిస్తుండాలని అధికారులకు సూచించారు. దర్శనం వేళలు దర్శనాలకు పట్టే సమయం మొదలైన అంశాలను నిరంతరం ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ప్రచారం చేస్తుండాలన్నారు.

దర్శనానికి వెళ్తూ వచ్చే భక్తులతో ముఖాముఖి చర్చించి దర్శనము దేవస్థానం కల్పించే సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్న చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు క్యూలైన్లలో కంపార్ట్మెంటులో భక్తులకు మంచినీరు అల్పాహారము నిరంతరం కొనసాగించాలని సిబ్బందిని ఆదేశించారు భక్తులు వేచి ఉండే ప్రదేశాలలో ఫ్యాన్లు లైట్లు తాజాగా పనిచేస్తూ ఉండేలాగా పర్యవేక్షణ ఉంచాలని,

ఎలక్ట్రికల్ వైరింగ్ ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు దేవస్థానం సిబ్బంది ముఖ్యంగా భక్తులకు దర్శనం ఏర్పాట్లు ప్రసాద వితరణ పారిశుధ్య నిర్వహణ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు శ్రీశైలం వచ్చే ప్రతి ఒక భక్తుడు దర్శనంతో సంతృప్తి చెందాలని ఎవరు కూడా అసౌకర్యాలకు గురికాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సూచించారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story