Srisailam: శ్రీశైలంలో భక్తులను అలరించిన “శ్రీశైలమాహాత్మ్యం” ప్రవచనం!
Srisailam: శ్రీశైల దేవస్థానం 'ధర్మపథం'లో భాగంగా శనివారం నిర్వహించిన 'నిత్య కళారాధన' వేదికపై డా. వి. రవిశంకరశర్మ గారి “శ్రీశైలమాహాత్మ్యం” ప్రవచనం.
Srisailam: శ్రీశైలంలో భక్తులను అలరించిన “శ్రీశైలమాహాత్మ్యం” ప్రవచనం!
Srisailam: శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) శనివారం డా.వి. రవిశంకరశర్మ, హైదరాబాద్ వారిచే “శ్రీశైలమాహాత్మ్యం” పై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద శనివారం సాయంకాలం 6 గంటల నుండి ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
Next Story




