Srisailam: కార్తిక మాస రద్దీకి పక్కా ఏర్పాట్లు: ఈవో శ్రీనివాసరావు!

Srisailam: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో క్యూలైన్లు, అన్నప్రసాద వితరణను ఈవో ఎం. శ్రీనివాసరావు పరిశీలించి, కార్తిక మాస ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 22 Oct 2026 10:46 PM IST
Srisailam
X

Srisailam: కార్తిక మాస రద్దీకి పక్కా ఏర్పాట్లు: ఈవో శ్రీనివాసరావు!

శ్రీశైలం: ఈ రోజు సాయంత్రం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనిసవారావు సర్వదర్శనం,శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలోని దర్శనం క్యూలైన్లు, క్యూకాంప్లెక్సు కంపార్టుమెంట్లను మొదలైనవాటిని పరిశీలించారు. అదేవిధంగా అన్నప్రసాదవితరణ భవన సముదాయం, లడ్డుప్రసాదాల విక్రయకేంద్రాల క్యూలైన్లను పరిశీలించారు.

ముఖ్యంగా ఆయా క్యూలైన్లలో ఏర్పాటు చేసిన సి.సి. కెమెరాల అమరికను ప్రత్యేకంగా కార్యనిర్వహణాధికారివారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు కార్తికమాసంలో భక్తులరద్దీ అధికంగా ఉంటుందన్నారు.

రోజువారి గాను మరియు రద్దీ సమయంలో కమాండ్ కంట్రోల్ రూము నుండి సంబంధిత అధికారులు క్యూలైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలన్నారు. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రూము అధికారులు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ సంబంధిత అధికారుల సమన్వయంతో క్యూలైన్ల నిర్వహణకు తోడ్పడాలన్నారు.

క్యూ లైన్లలో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సంబంధిత సిబ్బంది ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ దర్శనం క్యూలైన్లను నిర్వహిస్తుండాలన్నారు.

ఇంకా వారు మాట్లాడుతూ ముఖ్యంగా సర్వదర్శనం క్యూలైన్లలోని సాధారణ భక్తులకు సౌకర్యవoతమైన దర్శనం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ సమయంలో ముఖ్యంగా వారాంతపు సెలవులు పర్వదినాలలో క్యూ లైన్ల నిర్వహణ పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా దర్శనము వేళలు, దర్శనాలకు పట్టే సమయం మొదలైన అంశాలను నిరంతరం ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ప్రసారం చేస్తుండాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు క్యూ లైన్లలో ఎటువంటి అంతరాయం లేంకుడా మంచినీరు, అల్పాహారo అందిస్తుండాలని అధికారుకు సూచించారు.

అన్నీ క్యూ లైన్లలోని మరియు క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లలోని లైట్లు, ఫాన్లు, సజావుగా పనిచేసే విధంగా సంబంధించిన సిబ్బంది పర్యవేక్షిస్తుండాలన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వైరింగులకు ఎప్పటికప్పుడు అవసరమైన తగు మరమత్తులు చేస్తుoడాలన్నారు. అన్నీ క్యూలైన్లలోన ఫ్లోరింగులను పరిశీలించి అవసరమైనచోట్ల వెంటనే తగు మరమ్మతులు, ప్యాచ్ వర్కులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

తరువాత లడ్డుప్రసాదాల విక్రయకేంద్రాలను పరిశీలించారు. భక్తులు అధిక సమయం వేచివుండకుండా వుండేవిధంగా లడ్డు ప్రసాదాలను అందజేస్తుండాలన్నారు. రాబోవు కార్తికమాసములో అదనపు ప్రసాదాల విక్రయకేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు ఉండాలని అధికారులను అదేశించారు.

అనంతరం అన్నప్రసాదవితరణను పరిశీలించారు. కార్తికమాసంలో భక్తులరద్దీకనుగుణంగా అన్నప్రసాదవితరణ ఉండాలన్నారు. ప్రతీరోజు కూడా ఎటువంటి కాలతీతం లేకుండా భక్తులకు అన్నప్రసాదవితరణను ప్రారంభించాలన్నారు. భక్తుల సంఖ్యను బట్టి మధ్యాహ్నం గం. 3.30 వరకు కూడా అన్నప్రసాద వితరణ ఉండాలన్నారు. అదేవిధంగా అన్నప్రసాద వితరణ భవనంలో రాత్రివేళలో రాత్రి గం. 7.00ల నుంచే అల్పాహార వితరణను ప్రారంభించాలన్నారు. ఈ పరిశీలనలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM