Srisailam: శ్రీశైలంలో శివ సేవకులకు బంపర్ ఆఫర్.. ఈవో కీలక ప్రకటన
Srisailam: శ్రీశైల పుణ్యక్షేత్రంలో శివ సేవకుల స్వచ్ఛంద సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam: శ్రీశైలంలో శివ సేవకులకు బంపర్ ఆఫర్.. ఈవో కీలక ప్రకటన
శ్రీశైలం నంద్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈరోజు పరిపాలన భవనంలో శివసేవకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఈవో శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శివ సేవకుల స్వచ్ఛంద సేవను దేవస్థానం మరింత విస్తృతంగా వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు స్వచ్ఛంద సేవకు ఆసక్తి గల వారు నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు ఆన్లైన్ విధానంలో వ్యక్తిగతంగా స్వచ్ఛంద సేవకు నమోదు చేసుకోవచ్చన్నారు శివ సేవకులు నిర్వహించు సమయంలో దేవస్థానమే తాత్కాలికంగా గుర్తింపు కార్డులను అందజేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా శివ సేవకులు క్యూకాంప్లెక్స్, క్యూ లైన్ ల నిర్వహణ ఆలయ ప్రాంగణం, అన్న ప్రసాద వితరణ, కళ్యాణకట్ట, మొదలైన చోట్ల స్వచ్ఛంద సేవ ను అందించాలన్నారు శివ సేవకులు వారికి కేటాయించిన ప్రదేశాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సేవలను అందజేయాలన్నారు స్వచ్ఛంద సేవకులు అందరూ అంకితభావంతో భక్తులకు సేవలు అందించాలన్నారు ముఖ్యంగా యాత్రికులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు ప్రతి యాత్రికుడిని కూడా దేవస్థానానికి వచ్చిన అతిథిగా భావించాలన్నారు సేవ సమయంలో భక్తులు అడిగే సమాచారాన్ని సేవకులు ఓపికతో తెలియజేయాలన్నారు దేవస్థానం అధికారులు సిబ్బంది అందరూ కూడా శివసేవకులకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలన్నారు క్షేత్రాన్ని దర్శించే భక్తులకు మరియు దేవస్థానానికి శివసేవకులు వారదులుగా వ్యవహరించాలని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.




