Srisailam: మల్లన్న ఆలయ 35 రోజుల హుండీ ఆదాయం రూ. 5.88 కోట్లు
Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయాల 35 రోజుల హుండీ లెక్కింపులో రూ. 5.88 కోట్ల నగదు, బంగారం, వెండి మరియు విదేశీ కరెన్సీ లభించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam: మల్లన్న ఆలయ 35 రోజుల హుండీ ఆదాయం రూ. 5.88 కోట్లు
శ్రీశైలం: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయాల హుండీ లెక్కింపు, శ్రీశైలం మల్లన్న ఆలయానికి 35 రోజుల మల్లన్న హుండీ ఆదాయం రూ 5 కోట్ల 88 లక్షల 89 వేల 846 నగదు, బంగారం 87 గ్రాముల 200 మిల్లి గ్రాములు,4 కేజీల 250 గ్రాముల వెండి వివిధ దేశాల విదేశీ కరెన్సీ లభ్యం.
హుండీ లెక్కింపులో పాల్గొన్న చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు, ట్రస్టు బోర్డు మెంబర్లు, అధికారులు,శివ సేవకులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు,హుండీ లెక్కింపు నిర్వహించారు అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 88 లక్షల 89 వేల 846 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఈ ఆదాయాన్ని గత 35 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 87 గ్రాముల 200 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 4 కేజీల 250 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 540, యూఏఈ దిర్హమ్స్ 1610,ఇంగ్లాండ్ పౌండ్స్ 140, ఒమన్ బైసా 100, బహరైన్ దినార్ 109, మలేషియా రింగిట్స్ 21, సింగపూర్ డాలర్లు 20, సౌదీ రియాల్స్ 10, ఒమాన్ రియాల్స్ 5,
మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు,ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.




