Srisailam: దేవదాయశాఖ మంత్రిని ఆహ్వానించిన శ్రీశైలం ఈవో, చైర్మన్!
Srisailam: శ్రీశైలంలో నిర్వహించనున్న వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకానికి హాజరుకావాలని కోరుతూ దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆలయ ఈవో, చైర్మన్ ఆహ్వానించారు.
Srisailam: దేవదాయశాఖ మంత్రిని ఆహ్వానించిన శ్రీశైలం ఈవో, చైర్మన్!
Srisailam: శ్రీశైలం లో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకానికి దేవదాయశాఖ మంత్రికి ఆహ్వానం
రేపటి నుండి ఈనెల 11 వరకు శ్రీశైలం మల్లన్న ఆలయంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో 5 రోజుల పాటు వరుణయాగసహిత సహస్ర ఘటాభిషేకాన్ని శ్రీకారం చుట్టనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆలయ ఈవో శ్రీనివాసరావు,చైర్మన్ రమేష్ నాయుడు,వేదపండితులు ఆహ్వాన పత్రిక అందజేసి వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకానికి ఆహ్వానించారు అనంతరం శ్రీశైలం ఆలయ వేదపండితులు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రాలు, ప్రసాదాలను చైర్మన్, ఈవో,వేదపండితులు అందజేశారు.




