Srisailam: శ్రీశైలంలో భక్తులను కట్టిపడేసిన శివతాండవం!

Srisailam: శ్రీశైల దేవస్థానం నిత్యకళారాధనలో భాగంగా విజయవాడ నృత్యకళాంజలి బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 24 Jun 2026 9:13 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో భక్తులను కట్టిపడేసిన శివతాండవం!

శ్రీశైలం: శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) బుధవారం నృత్యకళాంజలి, విజయవాడ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతున్నది.

ఈ కార్యక్రమములో మూషికవాహన, నటరాజశబ్దం, , ఓం నమశ్శివాయ, శివతాండవం తదితర గీతాలకు శర్వాణి, భవ్య, బన్విశ్రీ, వెంకటేశ్వర్లు, ఆకృతి తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.

కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story