Srisailam: శ్రీశైల మల్లన్నకు కోటి రూపాయల బంగారు, వెండి కానుకలు!
Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామికు కాకినాడ జిల్లాకి చెందిన మట్టే శ్రీనివాస్ దంపతులు కోటి రూపాయల విలువైన వెండి, 73 గ్రాముల బంగారు ఆభరణాలను సమర్పించారు.
Srisailam: శ్రీశైల మల్లన్నకు కోటి రూపాయల బంగారు, వెండి కానుకలు!
Srisailam: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కాకినాడ జిల్లా, పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా ఎంటర్ ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు శ్రీ స్వామిఅమ్మవార్లకు పలు వెండి వస్తువులను, బంగారు అభరణాలను శనివారం సమర్పించారు. బంగారు నామాలు మరియు చంద్రవంక కలిగిన వెండి జటాజూటం, పలు వెండి పూజావస్తువులు మరియు బంగారు రుద్రాక్షమాల, మంగళసూత్రాలను వీరు సమర్పించడం జరిగింది.
కాగా సమర్పించబడిన మొత్తం వెండి వస్తువుల బరువు 42 కేజీల 516 గ్రాములు కాగా, బంగారు అభరణాల బరువు 73 గ్రాముల 500 మిల్లీ గ్రాములు. వీటి విలువ సుమారు కోటి రూపాయల దాకా ఉంటుందని దాతలు తెలియజేశారు.
ఈ బంగారు అభరణాలు మరియు వెండివస్తువులను దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ఆలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ మట్టే శ్రీనివాస్ కుటుంబసభ్యులైన రోహన్, రాకేష్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ డైరెక్టర్ మరియు ఆదిత్యకృష్ణ తదితరులు కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావుగారికి అందజేయడం జరిగింది.
కార్యక్రమములో స్వామివార్ల ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయకుమార్ స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజిరవి, ధర్మప్రచార పర్యవేక్షకులు నాగేశ్వరరావు, అమ్మవారి ఆలయ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున, ముఖ్యభద్రతా అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.




