Srisailam: శ్రీశైలంలో 8వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు!
Srisailam: శ్రీశైల భక్తులకు శుభవార్త! దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు.
Srisailam: శ్రీశైలంలో 8వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు!
Srisailam: శ్రీశైలం దేవస్థానం 8వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం ముగిసింది సమీక్ష సమావేశంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొనగా 45 అంశాలు చర్చించగా, అందులో 34 అంశాలు ఆమోదం, 7 అంశాలను వాయిదా, 4 అంశాలు బోర్డ్ తిరస్కరించింది తెలిపారు.
దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ సామాన్య భక్తుల మౌలిక సదుపాయాల కల్పన పట్ల ప్రత్యేకంగా చర్చించడం జరిగిందన్నారు క్యూ కాంప్లెక్స్ నిర్మాణం క్షేత్రంలో సామాన్య భక్తుల సౌకర్యాల కేంద్రం ( అమినిటీస్ కాంప్లెక్స్) క్షేత్ర పరిధిలో మరిన్ని సౌచాలయాల ఏర్పాటు తదితర అంశాలు చర్చించబడ్డాయని తెలిపారు సమీక్ష సమావేశంలో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాలు వివరించిన దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు క్షేత్ర పరిధిలోని పార్కింగ్ ప్రదేశాలు, ఆరు బయలు ప్రదేశాలలో హైమాస్ట్ టవర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత వైద్యశాలకు అవసరమైన మందులు,సూది మందులు మరియు ల్యాబ్ పరికరాలను ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు టెండర్లను పిలవాలని తీర్మానం చేసాము క్షేత్ర పరిధిలో నంది మండపం నుంచి ఆర్టీసీ బస్టాండ్ లాకర్ల షెడ్డు నుంచి గంగాధర మండపం బస్టాండ్ కూడలి మొదలైనచోట్ల ఆక్టోగోనాల్ విద్యు విద్యుత్ స్తంభాలు రింగు బ్రాకెట్లు మరియు ఎల్ఈడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయుటకు తీర్మానించడమైనదని తెలిపారు.
గణేష్ సదన్ మరియు మల్లికార్జున సదన్ డార్మెంటరీలలో 38 లక్షల 50వేళా 000 అంచనా వ్యయంతో బంకర్ బెడ్లను ఏర్పాటు చేయుటకు తీర్మానించడం అయినది అని అన్నారు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్మించిన కాటేజీలు, అతిథి గృహాలు,వసతి సముదాయాలు,ప్రధాన ఆలయం డార్మెంటరీలు, క్యూ కాంప్లెక్స్ మొదలైన చోట్ల అవసరం మేరకు సివిల్ మెయింటెనెన్స్ పనులు మరియు అవసరమైన మరమత్తులు చేయుటకు తీర్మానం చేశాము.
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణలో భాగంగా శ్రీశైల ఖండం, శ్రీశైల కదంబం, శ్రీశైల కండాంతర్గత, భ్రమరాంబ మల్లికార్జున స్వామి పూజా విధానం గ్రంథాలను పునర్ ముద్రించాలని తీర్మానం చేశాము పంచ మఠాలలో అతి ప్రాచీనమైన ఘంటా మఠం పునర్నిర్మాణ పనులలో పలు దపాలుగా లభించిన తామ్ర శాసనాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్ వారు పరిష్కరించాయన్నారు సదరు శాసనాల వివరాలను గ్రంథ రూపంలో ముద్రించాలని తీర్మానించడం జరిగిందన్నారు.
జనరల్ మెయింటెనెన్స్ లో భాగంగా ఐదు లక్షల అంచనా వ్యయంతో ఈ ప్రోక్యుమెంట్ టెండర్ ద్వారా ఎలక్ట్రికల్ మెటీరియల్ కొనుగోలుకు చేయుటకు తీర్మానం చేశామని తెలిపారు క్షేత్ర పరిధిలో తగిన ప్రదేశాలలో ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించాలని తీర్మానం చేయడం జరిగిందని దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు.




