Srisailam: 18 అంశాలకు ఆమోదం తెలిపిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు

Srisailam: శ్రీశైలంలో ముగిసిన 11వ ట్రస్ట్ బోర్డు సమావేశం. దసరా ఉత్సవాల్లో సహస్ర చండీ హోమం, ఉచిత శౌచాలయాల వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకున్న దేవస్థానం.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 23 Sept 2026 11:29 PM IST
Srisailam
X

Srisailam: 18 అంశాలకు ఆమోదం తెలిపిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈరోజు పరిపాలన భవనంలో 11వ ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో 20 అంశాలు చర్చలు పెట్టి 18 అంశాలకు ఆమోదం,2 అంశాలు వాయిదా వేయడం జరిగిందన్నారు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ అక్టోబర్ 11 నుండి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలలో వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు సౌకర్యాలు కల్పిస్తామన్నారు క్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యాల కోసం ధర్మకర్తల మండలి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు సామాన్య భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు లోక కళ్యాణం కోసం ఈ సంవత్సరం దసరా మహోత్సవాలలో సహస్ర చండీ సహిత మహా రుద్ర హోమాన్ని జరిపించాలని ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందన్నారు.

ఉత్సవాలలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈసారి సహస్ర చండీ హోమాన్ని నిర్వహించేందుకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది అన్నారు దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతి సరస్వతి అమ్మవారి ఆలయంలో మూడు కోట్ల 20 లక్షలకు అభివృద్ధి పనులు చేపట్టడానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందన్నారు శాశ్వత పనులకు 3 కోట్ల 13 లక్షల తాత్కాలిక పనులకు 7 లక్షల రూపాయల తో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

శాశ్వత పనులలో ఆలయ మండపాన్ని పూర్తి చేయడం ధ్వజ ప్రతిష్ట,ఆలయ కలస్థాపన,అమ్మవారి ఆలయ రహదారి,ముఖద్వార నిర్మాణం,శాశ్వత క్యూలైన్లు, బోరుబావి ఏర్పాటు లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు క్షేత్ర పరిధిలోని శౌచాలయాలను భక్తుల నుంచి ఎలాంటి వినియోగ రుసుము వసూలు చేయకూడదని ధర్మకర్తల మండలి నిర్ణయించింది.

భక్తులు ఉచితంగానే శౌచాలయాలను మరియు స్నానపు గదులను వినియోగించే సదుపాయాన్ని కల్పించాలని ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది నందీశ్వర డార్మెంటరీకి 10 లక్షల రూపాయలతో అవసరమైన మరమ్మత్తులు చేసే ప్రతిపాదనను ధర్మకర్తల మండలి ఆమోదించిందన్నారు డిసెంబర్ 10వ తేదీ నుంచి శ్రీశైలంలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకును దేవస్థానమే నిర్వహించేందుకు ధర్మకర్తల మండలి తీర్మానించింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విధినా నిర్ణయాలలో భాగంగా పాలన పరమైన అంశాల నిర్వహణలో సాంకేతికతను మరింతగా వినియోగించుకోవాలని భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పించేందుకు దేవస్థానంలో సీసీ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేయడం జరిగిందన్నారు దీనివలన భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ వాహనాల క్రమబద్ధీకరణ మొదలైన వాటిలో ఏఐ ఆధారిత పరిష్కారాలతో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM