Srisailam: శ్రీశైలంలో భక్తులను అలరించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరికు చెందిన కళాంజలి నృత్యనికేతన్ అకాడమీ నృత్య ప్రదర్శనలు.
Srisailam: శ్రీశైలంలో భక్తులను అలరించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు
Srisailam: శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) కళాంజలి నృత్యనికేతన్ డాన్సు అకాడమీ, పశ్చిమగోదావరి వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద మంగళవారం సాయంకాలం ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతున్నది.
ఈ కార్యక్రమములో గణపతి కౌత్వం, జయ గణనాయక, మూషికవాహన, విఘ్నరాజంభజే, లింగాష్టకం, భో..శంభో, నమశ్శివాయతే, అయిగిరినందిని, శివలీలలు తదితర గీతాలకు ఆరాధ్య, లోహిత, హన్విక, హరిణి, సంహిత, ప్రజ్ఞాలహరి, రేణుక, తన్వి, లక్ష్మీ తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయిని శ్రీశైలం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు.




